తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు.
బుక్కరాయసముద్రం : తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, అనంతపురం డిఎస్పీ మల్లికార్జున వర్మ, జెడ్పీటీసీ రామలింగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చమన్‌సాహెబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వాలని సూచించారు. అనంతరం 80 మంది మరణానంతరం నేత్ర దానం చేస్తామని అంగీకార పత్రాన్ని నిర్వాహకులకు ఇచ్చారు.