పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పీఏపల్లి గ్రామపంచాయతీ పరిధి బాలాజీనగర్‌లో గురువారం చోటు చేసుకుంది.
పెద్దఅడిశర్లపల్లి : పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పీఏపల్లి గ్రామపంచాయతీ పరిధి బాలాజీనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... బాలాజీనగర్‌కు చెందిన మెగావత్ భాస్కర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భాస్కర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమారుడైన మెగావత్ పవన్‌నాయక్ (13) కొండమల్లేపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వతరగతి చదువుతున్నాడు.ఉదయం ఇంటి వద్దే ఉన్న పవన్ బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. దీంతో ఇంటికి వచ్చి కళ్లు తిరుగుతున్నాయని ఒంట్లో నలతగా ఉందని తన తండ్రి భాస్కర్‌కు చెప్పాడు. కుమారుడిని గమనించిన తండ్రి భాస్కర్ ఒంటిపై పాము కాటు వేసిన గుర్తులు చూసి హుటాహుటీనా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.