వాహనాల బోల్తా
-
భవానీ యాత్రికుడి మృతి
-
46 మందికి గాయాలు
రాజమహేంద్రవరం క్రైం :
దుర్గమ్మ దర్శనానికి బయల్దేరిని భవానీ భక్తుల వాహనానికి జరిగిన ప్రమా దంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. రాజమహేం ద్రవరం ప్రకాష్‌నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు కథనం మేరకు విశాఖ జిల్లా అనకాపల్లి మం డలం కొత్తూరు, నర్సింగరావు పేట గ్రామానికి చెంది న 23 మంది భవానీ భక్తులు మంగళవారం రాత్రి 11.30 గంటలకు బొలేరో వాహనంలో విజయవాడ బయలుదేరారు. మార్గం మధ్యలో డ్రైవర్‌కు నిద్ర రావడంతో టీ తాగి మరలా బయల్దేరారు. అనంతరం 10 కిలోమీటర్లు దాటిన తరువాత బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రాజమహేంద్రవ రం జాతీయ రహదారి గాదాలమ్మ పుంత రోడ్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ కునుకుతీస్తూ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో వాహనం ఎగిరి అవతల రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో కరణం లోకేష్ (16)వాహనం నుంచి ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన 20 మంది గాయాల పాలయ్యారు. ఇద్దరు మాత్రం సురక్షితంగా బయట పడ్డారు.
డ్రైవర్ నిర్లక్ష్యం
పది మంది పట్టే బొలేరో వ్యాన్‌లో మొత్తం 23 మం దిని ఎక్కించుకొని విజయవాడ బయలుదేరిన వ్యాన్‌డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని ప్రకాష్ నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆస్పత్రిలో క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘాట్‌రోడ్‌లో ట్రాక్టర్ బోల్తా....
చింతూరు : మారేడుమిల్లి– చింతూరు ఘాట్‌రోడ్‌లో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపyì ంది. ఈ ఘటనలో చింతూరు మండలం సిరసనపల్లికి చెందిన 26 మంది గాయపడ్డారు. ఘాట్‌రోడ్‌లోని కనకదుర్గను దర్శించుకునేందుకు వీరంతా ట్రాక్టర్‌పై పయనమయ్యారు. ట్రాక్టర్ ఇంజన్‌కు, ట్రక్కుకు నడుమ ఉన్న లింక్ ఊడిపోవడంతో ట్రక్కు బోల్తాపడినట్టు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో మడివి పెదశీతమ్మ, మడకం సాయమ్మకు తీవ్ర గా యాలవడంతో వారికి చింతూరులో ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరికీ చింతూ రు ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. కాగా ఘాట్‌రోడ్‌లో వరుసగా రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయి. సోమవారం కిర్లంపూడి నుంచి భద్రాచలం సీతారాముల దర్శనానికి వెళుతున్న ఆటో బోల్తాపడడంతో ఆరుగురు భవానీ భక్తులు గాయపడారు.