bhavanilu
-
23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు. 23న మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు. 14 నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు. -
వాహనాల బోల్తా
భవానీ యాత్రికుడి మృతి 46 మందికి గాయాలు రాజమహేంద్రవరం క్రైం : దుర్గమ్మ దర్శనానికి బయల్దేరిని భవానీ భక్తుల వాహనానికి జరిగిన ప్రమా దంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. రాజమహేం ద్రవరం ప్రకాష్‌నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు కథనం మేరకు విశాఖ జిల్లా అనకాపల్లి మం డలం కొత్తూరు, నర్సింగరావు పేట గ్రామానికి చెంది న 23 మంది భవానీ భక్తులు మంగళవారం రాత్రి 11.30 గంటలకు బొలేరో వాహనంలో విజయవాడ బయలుదేరారు. మార్గం మధ్యలో డ్రైవర్‌కు నిద్ర రావడంతో టీ తాగి మరలా బయల్దేరారు. అనంతరం 10 కిలోమీటర్లు దాటిన తరువాత బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రాజమహేంద్రవ రం జాతీయ రహదారి గాదాలమ్మ పుంత రోడ్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ కునుకుతీస్తూ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో వాహనం ఎగిరి అవతల రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో కరణం లోకేష్ (16)వాహనం నుంచి ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన 20 మంది గాయాల పాలయ్యారు. ఇద్దరు మాత్రం సురక్షితంగా బయట పడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం పది మంది పట్టే బొలేరో వ్యాన్‌లో మొత్తం 23 మం దిని ఎక్కించుకొని విజయవాడ బయలుదేరిన వ్యాన్‌డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని ప్రకాష్ నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆస్పత్రిలో క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘాట్రోడ్లో ట్రాక్టర్ బోల్తా.... చింతూరు : మారేడుమిల్లి– చింతూరు ఘాట్రోడ్లో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపyì ంది. ఈ ఘటనలో చింతూరు మండలం సిరసనపల్లికి చెందిన 26 మంది గాయపడ్డారు. ఘాట్‌రోడ్‌లోని కనకదుర్గను దర్శించుకునేందుకు వీరంతా ట్రాక్టర్‌పై పయనమయ్యారు. ట్రాక్టర్ ఇంజన్‌కు, ట్రక్కుకు నడుమ ఉన్న లింక్ ఊడిపోవడంతో ట్రక్కు బోల్తాపడినట్టు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో మడివి పెదశీతమ్మ, మడకం సాయమ్మకు తీవ్ర గా యాలవడంతో వారికి చింతూరులో ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరికీ చింతూ రు ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. కాగా ఘాట్రోడ్లో వరుసగా రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయి. సోమవారం కిర్లంపూడి నుంచి భద్రాచలం సీతారాముల దర్శనానికి వెళుతున్న ఆటో బోల్తాపడడంతో ఆరుగురు భవానీ భక్తులు గాయపడారు. -
భవానీలకు అవస్థలు
= స్నాన ఘట్టాల్లో నీటికి ఇబ్బందులు = మోటారు పనిచేయక ఆగిన జల్లు స్నానాలు = క్లోక్ రూమ్‌ల్లో నిలువు దోపిడీ = రోడ్లు సరిగాలేక గిరిప్రదక్షిణలోనూ తప్పని తిప్పలు సాక్షి, విజయవాడ : భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భక్తులకు తిప్పలు తప్పడంలేదు. అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. మంగళవారం దుర్గా స్నానఘాట్లలో నీటి మోటార్లు పనిచేయకపోవడంతో జల్లు స్నానాలు నిలిపివేశారు. ఉదయం భక్తులు ఎక్కువగా ఉండడం, అదే సమయంలో జల్లు స్నానాలు నిలిపివేయడంతో భవానీలు ఇబ్బందిపడ్డారు. సోమవారం నుంచి పంటకాలువలకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని పెంచడంతో ఘాట్లలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దాదాపు అడుగున్నర మేర నీరు తగ్గడంతో భక్తులు మోకాళ్లపై నిల్చుని స్నానాలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. భవానీ సౌకర్యార్థం ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌లు, మరుగుదొడ్ల వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదుచేశారు. మరుగుదొడ్లను ఉపయోగించిన వారినుంచి రూ.10, క్లోక్‌రూమ్‌లో చెప్పుల జత, బ్యాగ్ పెడితే రూ.25 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కుర్రాళ్లు దురుసుగా వ్యవహరిస్తున్నారని భవానీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో దారి సరిగా లేక భవానీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిపించని రద్దీ భవానీ దీక్షల విరమణ రెండోరోజున భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మంగళవారం ఇరుముడులు సమర్పించడానికి భక్తులు ఇష్టపడకపోవడమే దీనికి కారణం. తెల్లవారుజామున ఓ మోస్తరుగా ఉన్న భక్తుల సంఖ్య పది గంటల నుంచి అంతంత మాత్రంగానే ఉంది. వీరిలో కూడా అత్యధికులు సోమవారం ఇరుముడులు సమర్పించినవారే. మంగళవారం కూడా రెండోసారి అమ్మవారి దర్శనం చేసుకొని వారు తిరుగుముఖం పట్టారు. రెండో రోజు లక్ష లడ్డూలు అమ్ముడయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి భవానీల రాక కాస్త పెరిగింది. నగరానికి చేరుకున్న భక్తులు బుధవారం ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఆదిదంపతుల జలవిహారం..వర్ణింపతరమా
= నేత్రపర్వంగా తెప్పోత్సవం = భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి = పెద్దసంఖ్యలో తరలివచ్చిన భవానీలు = సోమవారం కూడా రద్దీ ఉండే అవకాశం సాక్షి, విజయవాడ : గంగాసమేత దుర్గామల్లేశ్వరస్వామివార్ల జలవిహారం జనహారంగా సాగింది. దసరా ఉత్సవాల ముగింపు రోజైన ఆదివారం సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో హంసవాహనంపై విశ్వేశ్వరి ముమ్మార్లు విహరించింది. వేలాదిమంది భక్తులు ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి తరించారు. తొలుత ఇంద్రకీలాద్రి నుంచి ఊరేగింపుగా గంగాదేవి, దుర్గాదేవి, మల్లిఖార్జునస్వామి వార్లు ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ అర్చకులు తీసుకువచ్చారు. ఘాట్‌లో రంగురంగుల విద్యుత్తు దీపకాంతులు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి సిద్ధంగా ఉన్న హంసవాహనంపై అధిష్టించి త్రిలోక సంచారిణి జలవిహారం చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా పేలుళ్లు మధ్య సాగిన అమ్మవారి నౌకా విహార కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు కళ్లు చాలలేదు. తెప్పోత్సవం సాగినంతసేపు దుర్గాఘాట్‌లో జై భవానీ అంటూ భక్తులు జైజై ధ్వానాలు చేశారు. బ్యారేజీ, అశోకస్తంభం పరిసరాలన్నీ జనంతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్‌కలెక్టర్ హరిచందన, పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన భవానీలు విజయదశమి రోజున దుర్గమ్మ శాంతిమూర్తిగా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మను దర్శించి తరించేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. ఎర్రని దుస్తులు ధరించి నలభైరోజులు పాటు దీక్ష పాటించిన భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకుని దీక్ష విరమించడం ఆనవాయితీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భవానీలు ఆదివారం దుర్గగుడికి రావడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. ఈ భక్తులు కృష్ణానదిలో పవిత్రస్నానాలు చేసి తడిబట్టతోనే గంటలు తరబడి క్యూలలో నిలబడి అమ్మవార్ని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి అర్ధరాత్రి రాటే వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తొమ్మిది రోజులు పాటు సాగిన దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ముగిశాయి. టీటీడీ నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు వెంకటేశ్వరస్వామి సోదరిగా దుర్గమ్మకు టీటీడీ ఏఈఓ రామూర్తి రెడ్డి, అర్చకుడు గోపాలాచార్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే టీటీడీ అధికారులకు తీవ్ర అవమానం జరిగింది. టీటీడీ నుంచి పట్టువస్త్రాలను తీసుకువచ్చిన అధికారుల్ని అంతరాలయ దర్శనం చేయించకుండా కేవలం లఘుదర్శనానికే పరిమితం చేయడం పలు విమర్శలకు దారితీసింది. సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బంది ఉత్సవాలకు ప్రారంభానికి ముందు, తరువాత అధికారులు ఎన్ని సమావేశాలు నిర్వహించినా చివరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఆదివారం ఉదయం వరకు విధులు నిర్వహించిన దేవస్థానం సిబ్బంది సాయంత్రం కొండపై కనపడలేదు. దుర్గాఘాట్‌లో తెప్పోత్సవం జరుగుతూ ఉండటంతో అంతా అక్కడకు చేరుకున్నారు. దీంతో క్యూలలో నిలబడిన భక్తులు నానా అవస్థలు పడ్డారు. వినాయకుడు గుడి వద్ద క్యూలలో నిలబడిన భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్లు ఇచ్చే నాథుడే కరువయ్యారు. స్నానఘట్టాల్లో పదుల సంఖ్యలో క్షురకుల్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయితే ఒకేసారి వేలాది మంది భక్తులు తరలిరావడంలో తలనీలాలు సమర్పించడంలో సమస్య తలెత్తింది. దీంతో రాజీవ్ పార్కు, పండిట్ నెహ్రు బస్‌స్టేషన్, దుర్గాఘాట్ బయట ప్రైవేటు క్షురకుల వద్దనే భక్తులు తలనీలాలను సమర్పించి, నదీ స్నానం ఆచరించారు. నదిలో స్నానాలు చేసి వచ్చిన మహిళలు చీరలు మార్చుకునేందుకు గదులు సరిపోకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కొనసాగుతున్న రద్దీ దసరా ఉత్సవాలు పూర్తయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై రద్దీ మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం సోమవారం విజయదశమి అని ప్రకటించడంతో సోమవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో దేవస్థానం అధికారులు భవానీభక్తులకు ఏ మేరకు ఇబ్బందిలేకుండా చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రైల్వేస్టేషన్లో భవానీల రద్దీ శరన్నవరాత్రుల్లో చివరి రోజు అయిన ఆదివారం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భవానీలతో విజయవాడ రైల్వేస్టేషన్ నిండిపోరుుంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భవానీలు నగరానికి చేరుకున్నారు. ఉదయం రాయగడ్, విశాఖపట్నం-విజయవాడ పాసింజర్లతో పాటు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భవానీలు ఎక్కువగా వచ్చారు.