ఉపాధి అక్రమాలపై నజర్‌.. | Activities against those who are corrupt | Sakshi
Sakshi News home page

ఉపాధి అక్రమాలపై నజర్‌..

Published Wed, Aug 23 2017 1:44 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

ఉపాధి అక్రమాలపై నజర్‌.. - Sakshi

ఉపాధి అక్రమాలపై నజర్‌..

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు
1,813 మందిపై అభియోగాలు..
జిల్లాకు అంబుడ్స్‌మెన్‌ కమిటీ
త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన
అవినీతి పరుల్లో గుబులు


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి దుమ్ముపట్టిన ఫైళ్లను వెలికితీయడానికి ప్రతీ జిల్లాకు అంబుడ్స్‌మెన్‌ కమిటీని         (న్యాయ నిపుణుల సంఘం) నియమించనుంది. వీరు జిల్లాలోని ఉపాధిహామీ కార్యాలయాల్లో ఉన్న దస్త్రాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టనున్నారు. ఉపాధిహామీలో సామాజిక తనిఖీల ద్వారా నమోదైన అభియోగాలు,     పెండింగ్‌లో ఉన్న బకాయిలు, వేతనాలు, పనిదినాలు తదితర అంశాలపై వీరు దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు.
కరీంనగర్‌సిటీ: 2006–07 ఏడాది నుంచి ఉమ్మ డి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు చూపుతున్నా రు. వలసలు నివారించాలనే ఉద్దేశంతో అప్ప టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. అయితే.. పనుల్లో అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సామాజిక తనిఖీ ల పేరిట అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా ఆగ లేదు. అవినీతి సొమ్ము రికవరీ కావడం లేదు. బాధ్యులపై చర్యలు తూ తూమంత్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ప్రతీ జిల్లాకో అంబుడ్స్‌మెన్‌ కమిటీ (న్యాయ నిపుణుల సంఘం) నియమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దీర్ఘకాలిక సమస్యలపై కమిటీ సభ్యులు దృష్టి సారించనున్నారు. ఏటా ఉమ్మ డి జిల్లాలో రూ.350 కోట్ల వరకు ఉపాధి పనులు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగిన అక్రమాలు, అవినీతిపై నివేదికలను సిద్ధం చేశారు. ప్రక్రియలో ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏఈఈలు, టీఏలు, సీవోలు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వీవోలు, బీపీఎంలు, శ్రమశక్తి సంఘాల నాయకులు, మేట్లు భాగస్వాములుగా ఉన్నారు.

అక్రమార్కులకు ఉపాధి..
2006 నుంచి 2017 వరకు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా జరిగిన ఉపాధిహామీ అవినీతిలో ఎక్కు వ అభియోగాలు మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టె క్నికల్‌ అసిస్టెంట్లపైనే నమోదై ఉన్నాయి. ఏటా అన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. అన్ని గ్రామాల్లోనూ తనిఖీలు చేపడుతారు. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లా అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అన్ని రికార్డులను పరిశీలించి పనిచేసిన దినాలకు, ఖర్చు చేసిన నిధులకు లెక్కలు సక్రమంగా కుదరకపోతే నివేదికల్లో రాస్తారు. ఆ ప్రతులను ఆయా ఉపాధిహామీ కార్యాలయాలకు పంపిస్తారు.

కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సామాజిక తనిఖీల ప్రక్రియ మందగించింది. 2006 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా తొమ్మిది సార్లు సామాజిక తని ఖీలు నిర్వహించారు. ఇందులో ఫీల్డ్‌ అసిస్టెంట్ల పాత్రే ఎక్కువగా ఉందని నిర్ధారించారు. ఇప్పటివరకు 23,478 మందిపై అభియోగాలు రా గా.. అందులో 10,200 పరిష్కారమయ్యాయి. ఇంకా 13,278 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,813 మంది ఉపాధిహామీ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని సామాజిక తనిఖీ ల్లో గుర్తించారు. రూ.81.54 లక్షల అవినీతి జరి గినట్లు గుర్తించగా ఇప్పటివరకు రూ.53.45 ల క్షలు రికవరీ చేయగలిగారు. ఎంపీడీవోలు 6, ఏపీవోలు 31, ఏఈలు 14, టీఏలు 243, సీవో లు 127, ఎఫ్‌ఏలు 1054, ఈసీలు 52, పీఎస్‌ లు 5, సర్పంచులు 7, వీవోలు 20, బీపీఎంలు 45, గ్రేడ్‌ లీడర్లు 10, మేట్‌లు 149, ఇతరులు 50 మంది అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు.  

రికవరీ తక్కువ.. ఖర్చు ఎక్కువ..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో వచ్చిన నిధులను ఈ ఏడాది ప్రారంభం నుంచి చేస్తున్న పనులకు సంబంధించిన కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. మూడు, నాలుగు నెలల నుంచి వేతనాలు ఇ వ్వకపోవడంతో కూలీలు నిరుత్సాహంతో ఉన్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు పనులపై ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ కూలీ పనులు పూర్తిస్థాయిలో దొరక్క.. ఉపాధిహామీ వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ఉపాధి అక్రమాలను నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం తాత్సారం చేస్తోంది. సామాజిక తనిఖీల పేరిట చేసిన ఖర్చులు రికవరీ సొమ్మకు సరిపడా ఉంటున్నాయి. వాహనాలు, పెట్రోలు, భోజనాలు తదితర ఖర్చుల పేరిట సామాజిక తనిఖీలకయ్యే ఖర్చే అధికంగా ఉంటుందే తప్ప రికవరీ కావడం లేదన్న ఆరోపణలూ లేకపోలేదు. అంబుడ్స్‌మెన్‌ కమిటీ రాకతో అక్రమాలకు అడ్డుకట్ట పడేనా? తిన్న సొమ్మ రికవరీ అయ్యేనా..!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement