వెండితెరపై గుర్తింపు పొంది, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆశగా ఉందని టీవీ, సినీనటుడు బాలు మహేంద్ర అన్నారు.
కొవ్వూరు రూరల్ : వెండితెరపై గుర్తింపు పొంది, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆశగా ఉందని టీవీ, సినీనటుడు బాలు మహేంద్ర అన్నారు. సత్యసింహా సీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న చిత్రంలో నటించడానికి పాలకొల్లుకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. నటనలో రజనీకాంత్, చిరంజీవి తనకు ఆదర్శమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వల్లూరు తన పుట్టిన ఊరని తెలిపారు.
తండ్రి సూర్యనారాయణ వ్యవసాయం చేస్తారన్నారు. జెమిని, ఈటీవీ, దూరదర్శన్ చానెళ్లలోని దేవత, కుంకుమరేఖ, వివాహబంధం, శ్రావణి సుబ్రహ్మణ్యం, అభిషేకం సీరియల్స్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు లభించిందన్నారు. సినిమాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నానని, గొడవ, లవకుశ, లక్ష్మి రావే మా ఇంటికి, చిత్రాల్లో నటించా నని, తెలుగు, తమిళంలో రిలీజ్ కానున్న ఓ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.