వర్షం బాధితులను ఆదుకోవాలి
Published Tue, Sep 27 2016 1:12 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
హన్మకొండ : ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అ««దl్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. హన్మకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలకు ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయని, ఇంతకాలం కరువుతో నష్టపోయిన రైతులను భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. నాణ్యత లోపంతో నిర్మించిన చెరువు కట్టలు కొట్టుకుపోయాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS నరహని వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 5550 చెరువులకు గాను 2976 చెరువులు మాత్రమే పూర్తిగా నిండాయని, 1900 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీరు వచ్చిందని, మిగతా చెరువులు నామమాత్రం గానే ఉన్నాయని చెప్పారు. పంట రుణాలు ఇప్పటికీ 50 శాతం ఇవ్వలేదని ప్రభుత్వమే చెపుతోందని, రైతు లు ఎంత మేర పంటలు సాగు చేశారో దీన్నిబట్టి అర్థమవుతుందని అన్నారు. రబీకి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిని అన్ని దేశాలు ఖండిస్తుంటే చైనా మాత్రం పాకిస్తా¯ŒSను వెనుకేసుకొస్తోందని, చైనాకు బుద్ధి చె ప్పాలంటే ఆ దేశ ఉత్పత్తులను ప్రతి పౌరుడు బహిష్కరించాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో బీజేపీ నాయకులు పెదగాని సోమ య్య, కూచన రవళి, తాళ్లపల్లి కుమరస్వామి, కొత్త దశరథం, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement