జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు | heavy rain fall in khammam district | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

Published Sat, Oct 1 2016 11:34 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

వెళ్లిపోయాయనున్న వర్షాలు మళ్లొచ్చాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయి.


దెబ్బతింటున్న పంటలు
ఆందోళన చెందుతున్న రైతులు
వాజేడులో అత్యధికంగా 8.34 సెం.మీలు
సగటు వర్షపాతం 1.55 సెం.మీలు

ఖమ్మం వ్యవసాయం :
వెళ్లిపోయాయనున్న వర్షాలు మళ్లొచ్చాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. చర్ల మండలం మినహా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 1.55 సెం.మీలు కాగా.. అత్యధికంగా వాజేడు మండలంలో 8.34 సెం.మీల వర్షపాతం(భారీ వర్షం) నమోదైంది. తిరుమలాయపాలెం, అశ్వాపురం దుమ్ముగూడెం మండలాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షం(3-6 సెం.మీల మధ్య) కురిసింది. 20 మండలాల్లో 1-3 సెం.మీల మధ్య వర్షపాతం నమోదు కాగా.. 16 మండలాల్లో 1 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ మూడో వారం నుంచి దాదాపు పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిసి.. కాస్త తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో చేలల్లో నీరు నిలిచి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు పడుతుండటంతో పంటలు మరింతగా దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. పత్తి కాయ దశలో దెబ్బతింటుందని.. మిర్చి పూత రాలుతుందని.. చెట్లు నేలవాలిపోతున్నాయని చెబుతున్నారు. ఇక జలాశయాల్లో మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు మరో రెండు, మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉండటంతో వాగులు, చెరువులు, ప్రాజెక్టులు మళ్లీ పొంగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నదాతలు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మాత్రం వర్షపాతం పుంజుకొని సాధారణం.. అంతకు మించి నమోదైంది.
జిల్లాలో వర్షపాతం సెం.మీలలో..
---------------------------------------------------------------
మండలం                       వర్షపాతం
-------------------------------------------------------------
వాజేడు            8.34
అశ్వాపురం            3.82
దుమ్ముగూడెం        3.62
తిరుమలాయపాలెం        3.14
ముదిగొండ            2.98
ముల్కలపల్లి            2.42
టేకులపల్లి            2.32
సత్తుపల్లి            2.32  
భద్రాచలం            2.20
కొత్తగూడెం            2.20
వేంసూరు            2.04  
వెంకటాపురం        1.94
ఖమ్మం రూరల్‌        1.86
మధిర            1.84  
ఇల్లెందు            1.76
నేలకొండపల్లి        1.66
చండ్రుగొండ            1.64
అశ్వారావుపేట        1.64
గార్ల            1.58
ఖమ్మం అర్బన్‌        1.58
చింతకాని            1.54
కూసుమంచి            1.22
దమ్మపేట            1.10
బోనకల్లు            1.02
ఎర్రుపాలెం            0.92
కొణిజర్ల            0.88
బయ్యారం            0.80  
పాల్వంచ            0.76
కల్లూరు            0.76
తల్లాడ            0.56
బూర్గంపాడు            0.54
పినపాక            0.64
పెనుబల్లి            0.44
సింగరేణి            0.42
కామేపల్లి            0.38
గుండాల            0.32
ఏన్కూరు            0.22  
జూలూరుపాడు        0.16
మణుగూరు            0.06
వైరా            0.06
-------------------------------------------------------
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement