31న వ్యవసాయ ప్రణాళిక తయారీపై సమావేశం | agriculture planing meet on 31st | Sakshi
Sakshi News home page

31న వ్యవసాయ ప్రణాళిక తయారీపై సమావేశం

Published Sun, Jan 29 2017 12:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

agriculture planing meet on 31st

కర్నూలు(అగ్రికల్చర్‌):  గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి వరకు  ఖరీప్‌ సీజన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శనివారం జేడీఏ విలేకర్లతో మాట్లాడుతూ... ఖరీప్‌లో సాగు అయ్యే ప్రధాన పంటలు, వాటిల్లో ఉత్పాదకతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై ఈ నెల 31న ఏడీఏలు, ఆర్‌ఎఆర్‌ఎస్, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశానికి ఏడీఏలు గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలతో రావాలని సూచించారు. జిల్లా వ్యవసాయ ప్రణాళిక ఖరారు అయిన తర్వాత ఫిబ్రవరి 4న గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఖరీప్‌ పంటల ఉత్పాదకత పెంపు అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు. ప్రధాన పంటల్లో ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జేడీఏ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement