పచ్చని కాపురంలో మద్యం చిచ్చు | Alcohol kept green kapuranlo | Sakshi
Sakshi News home page

పచ్చని కాపురంలో మద్యం చిచ్చు

Published Wed, Aug 10 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

పచ్చని కాపురంలో మద్యం చిచ్చు

పచ్చని కాపురంలో మద్యం చిచ్చు

భర్త తాగుడు మానలేదని భార్య ఆత్మహత్య 
పుట్లూరు : ఓ పచ్చని సంసారంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తన భర్త మద్యం తాగడం మానడం లేదన్న బెంగతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్లూరు మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన గురుప్రసాద్, వెంకటరమణమ్మ(32)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో రెండేళ్ల క్రితం నుంచి గురుప్రసాద్‌ మద్యానికి బానిసయ్యాడు. వెంకటరమణమ్మ భర్తకు ఎన్నిసార్లు చెప్పిచూసినా వినలేదు. చివరికి వారి కుటుంబంలో కలతలు రేగాయి. ఇదే విషయమై వారిద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్త మద్యం తాగి రావడంతో వెంకటరమణమ్మ అతడ్ని మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా మద్యం సేవించడం మానలేదన్న మనస్థాపంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. వెంకటరమణమ్మకు గురుహేమంత్‌ (4), గురునిషితా (3) అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement