అనంతపురం మెడికల్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎంపీహెచ్‌ఈఓ, సీహెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా మెడికల్ సిబ్బంది, వైద్యులు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి లార్వా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ, మునిసిపల్ సిబ్బందిని కలుపుకుని సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని తెలిపారు.
జ్వర బాధితులుంటే తక్షణం సమీప పీహెచ్‌సీలకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే, శనివారం పరిసరాల పరిశుభ్రత దినంగా పాటించాలన్నారు. అంటు వ్యాధుల నివారణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి చేపట్టే మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, డీఐఓ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్ కన్సల్టెంట్లు రితీశ్ బజాజ్, దిలీప్‌కుమార్, డీఎంఓ దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి
Published Fri, Jul 28 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
Advertisement