సాయికుమార్‌కు ఆలిండియా 40వ ర్యాంకు
Published Tue, Aug 2 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
సీఏ–ఐపీసీసీ ఫలితాల్లో రాజమహేంద్రవరం మాస్టర్‌మైండ్‌కు చెందిన పి.సాయికుమార్ ఆలిండియా 40వ ర్యాంకు సాధించారు. ఈ వివరాలను సంస్థ బ్రాంచ్ అకడమిక్ ప్రిన్సిపాల్ భవానీప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా, సబ్జెక్టులపై పూర్తి అవగాహనతో పరీక్షలు రాశానని వివరించారు. ఇష్టపడి చదవడం వల్లే ఈ ర్యాంకు వచ్చిందన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. తమ కళాశాల నుంచి అత్యధిక విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారని కళాశాల అడ్మిన్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement