
నటనే నా శ్వాస .. ధ్యాస
అదే నా శ్వాస.. ధ్యాస. ఆ ఇష్టతతోనే సినీరంగానికి వచ్చాను’ అని సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ అన్నారు.
‘నటనంటే నాకు చాలా మక్కువ.
అదే నా శ్వాస.. ధ్యాస. ఆ ఇష్టంతోనే సినీరంగానికి వచ్చాను’ అని సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ అన్నారు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోను మంచి పాత్రలు వస్తే చేస్తానని చెప్పారు. ప్రముఖ బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ జోస్ ఆలుక్కాస్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారు. ఆ షోరూమును ప్రారంభించేందుకు రాజమండ్రి వచ్చిన ఆమెతో ‘సాక్షి’ శనివారం ముచ్చటించారు.
ప్ర : మీరు పుట్టింది..
అమలాపాల్ : కేరళలోని కొచ్చి సమీపంలోని అలువ.
ప్ర : ఏం చదువుకున్నారు?
అ: సెయింట్ థెరిస్సా కళాశాలలో బీఏ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ చదివా.
ప్ర : మీ సినీరంగ ప్రవేశం గురించి చెప్పండి.
అ: మలయాళంలో నేను నటించిన తొలి సినిమా నీలతామర. దానిద్వారా సినిమాల్లోకి వచ్చాను.
ప్ర : తమిళంలో ఎన్ని సినిమాలు చేశారు?
అ: తమిళ్‌లో చాలా సినిమాలు చేశాను. అందులో తొలి సినిమా మైనా. దానికి నాకు అవార్డు వచ్చింది. దైవ తిరుమంగల్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
ప్ర : తెలుగులో మొదటి సినిమా?
అ: సిద్ధార్థ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్. తర్వాత రామ్‌చరణ్‌తో నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలు సినిమాలు చేశాను. ఇవి టాలీవుడ్‌లో నాకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ప్ర: ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?
అ: తమిళంలో ఒక పెద్ద సినిమా చేస్తున్నాను. ఆ వివరాలు ఇంకా చెప్పలేను.
ప్ర: రాజమండ్రి ఎలా ఉంది?
అ: ఇక్కడికి రావడం రెండోసారి. ఇక్కడి ప్రజలు మంచి మనసున్నవారు.