అమరచింత మండలం ఏర్పాటుపై సంబురాలు
Published Sat, Aug 20 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
ఆత్మకూర్ (నర్వ) : కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త మండలాల ప్రక్రియలో అమరచింతను కొత్త మండలంగా ఏర్పాటుచేసిన విషయంపై శనివారం అమరచింత అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఒకప్పడు అమరచింత నియోజకవర్గ కేంద్రంగా కొనసాగి కూగ్రామంగా కనుమరుగైన నేపథ్యంలో నేడు గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయిప్రకాష్ రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవతో కొత్త మండలాల్లో అమరచింత ఉండడం హర్షించదగ్గ విషయమని బాణాసంచా పేల్చి మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం దేశాయిప్రకాష్ రెడ్డిని కలిసి పూలమాలతో సన్మానించి అభినందనలను తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, అఖిలపక్షం నాయకులు అయ్యూబ్‌ఖాన్, నాగభూషణం గౌడ్, ఫయాజ్, గోపాల్‌నాయక్, కలాంపాష, రామన్‌గౌడ్, గోపి, నర్సింహులు గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్‌నాయక్ , టీఆర్‌ఎస్ నాయకులు షానవాజ్ ఖాన్, తోకలి రమేష్, తెలుగు రమేష్, రాజేష్, అంబేద్కర్ జాతరకమిటీ జిల్లా కార్యదర్శి విజయ్ పలువురు పాల్గొన్నారు.
Advertisement
Advertisement