హైదరాబాద్ : ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుపెట్టినట్లు ఓ చానల్‌లో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ప్రకటించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో అంబటి బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన ఎన్నికల కమీషనర్ భన్వర్‌లాల్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేసిన స్పీకర్ కోడెలపై సుమోటోగా చర్యలు తీసుకుని ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలని అంబటి కోరనున్నారు.