పూలు, ఉప్పుతో వేసిన అనిబిసెంట్ చిత్రం
అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషి
Published Sat, Oct 1 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– ఘనంగా అనిబిసెంట్ జయంతి
మదనపల్లె అర్బన్: బిటి కళాశాల వ్యవస్థాపకులు, విద్యాప్రదాత అనిబిసెంట్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. బిటి కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల నుంచి బెంగుళూరు రోడ్డులోని అనిబిసెంట్ సర్కిల్‌కు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ అనిబిసెంట్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిసెంట్‌హాల్‌లో కరస్పాండెంట్ ఎస్‌కె.వివేకానంద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాశ్చాత్యదేశంలో జన్మించిన అనిబిసెంట్ మదనపల్లె వాతావరణానికి ముగ్దులయ్యారని తెలిపారు. ఇక్కడి ప్రజల వెనుకబాటుతనాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో రాయలసీమలోనే తొలిసారిగా బిటికళాశాలను స్థాపించారని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన కళాశాలలో చదివిన వారు అనేక మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని వివరించారు. కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ కామకోటి ప్రసాదరావు, రేస్ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ రంగాచార్యులు, పూర్వ విద్యార్థి మార్పూరి నాగార్జునబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న అనిబిసెంట్ చిత్రం
బిటి కళాశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ అనిబిసెంట్ చిత్రాన్ని పూర్వ విద్యార్థులు, బిసెంట్ కల్చరల్ టీం కలిసి అనిబిసెంట్ చిత్రాన్ని పూలు, ఉప్పుతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో వెల్‌విషర్స్ సంస్థ వ్యవస్థాపకులు గిరీష్, వెంకటేష్, నాగరాజు,దిలీప్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement