రత్నగిరి..భక్తజన ఝరి
Published Sun, Nov 20 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
అన్నవరం:
కార్తిక మాసం సందర్భంగా సత్యదేవునికి స్వామివారి సన్నిధికి భక్తజనం వెల్లువలా వస్తున్నారు. ఆదివారం 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తికమాసం ప్రారంభం నుంచి అంటే గత నెల 31వ తేదీ నుంచి ఆదివారం వరకూ 20 రోజులకు రూ.ఐదు కోట్లు పైగానే ఆదాయం సమకూరినట్టు అధికారుల అంచనా. ఆదివారం ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారి వ్రతాలు కూడా అదే సమయం నుంచి మొదలయ్యాయి. సుమారు ఐదు వేలమంది భక్తులకు ఉచిత పులిహోర, దద్ధ్యోజనం పంపిణీ చేశారు.
ఆదివారం రూ. 50 లక్షల ఆదాయం
సత్యదేవుని వ్రతాలు ఆదివారం 5,693 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరిందని
అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement