ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రైతులు బలవన్మరణాలు చూడటానికి కాదని, తాము అండగా ఉంటామని, దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చినా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రైతులు బలవన్మరణాలు చూడటానికి కాదని, తాము అండగా ఉంటామని, దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చినా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.
పురుగుల మందు తాగి బండి నరేశ్ అనే కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్వశ్రీరామ్ పూర్ మండలం, జాఫర్ ఖాన్ పేటలో బండి నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు.