సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని సూరిబాబు అన్నారు.
విజయవాడ: సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూరిబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూములపై మద్రాస్ హైకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు.
ఓ పక్క కేసు నడుస్తుండగా.. ప్రభుత్వం టీడీపీ నేతలకు కట్టబెట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని రూ. 27 లక్షలకే కట్టబెట్టడంపై మండిపడ్డారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయని సూరిబాబు ఆరోపించారు.