ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు.
అనంతపురం : ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో రెవెన్యూ, ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ అజయ్‌కల్లాంను కలిసిన వినతిపత్రం అందజేశారు. వివిధ కేడర్లలో ఆమోదం పొందిన 40 పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, ప్రతి డిపోలోనూ సీఐ స్థాయి ఉద్యోగిని సూపర్‌వైజర్ పోస్టులో నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.నరసింహులు, ఉపాధ్యక్షులు రాముడు, జిల్లా సంఘం ప్రధానకార్యదర్శి అశ్వర్థరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ జాకీర్‌హుసేన్, సభ్యులు విశ్వనాథ్, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రావు ఉన్నారు.