కదం తొక్కిన ఆటో కార్మికులు
కదం తొక్కిన ఆటో కార్మికులు
Published Tue, Dec 13 2016 10:01 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్
– మున్సిపల్ క్రీడా మైదానం నుంచి డీఎస్పీ బంగ్లా వరకు భారీ ప్రదర్శన
ఆదోని టౌన్ : ఆటో కార్మికులు కదం తొక్కారు. నిబంధనల పేరుతో తమను పోలీసులు వేధిసు్తన్నారని, తక్షణమే దీన్ని ఆపాలని ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ క్రీడా మైదానం నుంచి ర్యాలీగా డీఎస్పీ బంగ్లాకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అజయ్‌బాబు, పట్టణ కార్యదర్శి వీరేష్, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు మహానందిరెడ్డి, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడారు. పెద్దనోట్లు రద్దుతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని చెప్పారు. అయితే ట్రాఫిక్ పోలీసులు యూనిఫాం, లైసెన్స్, ఆర్‌సీ, పర్మీట్లు చూపలేదనే సాకుతో రూ.వంద నుంచి రూ.500 దాకా జరిమాన వేస్తున్నారని ఆరోపించారు. రోజు మార్చి రోజు ఫైన్‌లు వేస్తుండటంతో ఆటో నడిపి సంపాదించన డబ్బు అంతా అందుకే సరిపోతుందన్నారు. ఇప్పటి వరకు ఆటోలకు స్టాండ్‌లు చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆటో స్టాండ్‌లు చూపాలని, ఇష్టారాజ్యంగా జరిమానాలు విధించరాదని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నాగరాజు, రామాంజనేయులు, ఈరన్న, వలి, పాండు, హుసేన్, వీరేష్, గోపాల్, రమణ, అంజి తదితరులు పాల్గొన్నారు.
Advertisement