స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
దుండిగల్: అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీతో మర్రి లక్ష్మణ్‌రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి. అమెరికాలో ఆ సంస్థ ప్రతినిధులు, కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీ బదలాయింపు, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్‌లో టెక్నాలజీ ఎదుర్కొనే సవాళ్లపై విద్యార్థులను సన్నద్దం చేసే విషయంపై ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమ కళాశాల అమెరికాలోని ఫర్దూ యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం పాటు న్యాక్, యూజీసీ, అటానమస్ హోదా పొందిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించిందని గుర్తు చేశారు.