న్యాయ వ్యవస్థతో సత్వరం న్యాయం
న్యాయ వ్యవస్థతో సత్వరం న్యాయం
Published Sun, Oct 16 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
చిల్లకూరు:మండల న్యాయసేవా సంస్థను ఆశ్రయిస్తే సత్వర న్యాయం, శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఏడవ అదనపు జిల్లా జడ్జి గుర్రప్ప అన్నారు. ఏరూరు, నాంచారమ్మపేట గ్రామాల్లో శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. దీని కోసం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వమిస్తున్నామన్నారు. అధిక శాతం భూముల విషయాల్లో అవగాహన లేక ఎంతో మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. మరో న్యాయమూర్తి ఏడుకొండలు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉందని, అయితే నేటికీ అది అమలు కావడంలేదన్నారు. ప్రస్తుతం గర్భంలో ఆడపిల్ల ఉన్నట్లు తెలిస్తే వెంటనే అబార్షన్ చేసేస్తున్నారని ఇలాంటి తప్పుడు నిర్ణాయాలు తీసుకోవడం తగదన్నారు. అనంతరం న్యాయమూర్తులు దివాకర్, కేపీ సాయరాంలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై అంకమ్మ, చింతవరం ఆసుపత్రి కమిటీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ముత్యాలపాడు సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ అమృతం లక్ష్మి, వెంకటయ్య, పెజ్జాయి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెంకటక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
Advertisement