బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
Published Sat, Sep 24 2016 1:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక మెక్లిన్స్‌క్లబ్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడలను మూడు విడతలుగా జరుపుతున్నట్లు తెలిపారు. తొలుత నెల్లూరులో బ్యాడ్మింటన్ పోటీలు జరుపుతున్నామన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 15, డబుల్స్ విభాగంలో 14, మహిళల సింగిల్స్ విభాగంలో 9, డబుల్స్ విభాగంలో 9 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతలను శివకాశిలోని మధురై కామరాజు వర్సిటీలో అక్టోబరు 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్‌వర్సిటీ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్‌యూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శ ఎం చంద్రమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, వీఆర్ కళాశాల అధ్యాపకుడు గరుడేశ్వర్‌రెడ్డి, టోర్నీ అబ్జర్వర్ సీవీ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement