‘కథల బతుకమ్మ’ పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్ : కథల బతుకమ్మ పుస్తకాన్ని హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ప్రతాపరుద్ర హాల్‌లో ఆకాశవాణి వరంగల్ కేంద్రం సహాయ సంచాలకుడు సి.జయపాల్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని డా. కె.పద్మలత రచించిన తీరు చక్కగా ఉందన్నారు. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డా.పర్చా అంజనీదేవి, విశిష్ట అతిథి, రచయిత రామాచంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని పెంపొందించే రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. అంపశయ్య నవీన్, ప్రముఖ కవులు వి.ఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ఏబీకే ప్రసాద్, కర్ర ఎల్లారెడ్డి , లకీ‡్ష్మనర్సింహారావు, డా.ప్రకాశ్‌చందర్, డా.సాయిదీప్తి తదితరులు పాల్గొన్నారు.