అపరిచిత ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త
Published Fri, Jul 22 2016 5:33 PM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
మాకవరపాలెం : అపరిచిత ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ పి.రమేష్ కోరారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకుల నుంచో, లేదా వేర్వేరు కంపెనీల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ చాలా మందికి కాల్స్ వస్తున్నాయన్నారు. మండలంలోని బూరుగుపాలెం గ్రామానికి చెందిన రుత్తల శ్రీరామ్మూర్తికి ఫోన్ చేసి అతడి ఏటీఎం కార్డు నంబరు, పాస్‌వర్డ్‌లను సైతం తెలుసుకుని రూ.35 వేల నగదు డ్రా చేశారన్నారు. అలాగే అన్‌రాక్‌లో పని చేస్తున్న కేశవరెడ్డి ఎల్లారెడ్డికి కూడా ఈ నెల 19న బ్యాంకు నుంచి ఫోన్ చేశామని ఏటీఎంపై ఉన్న 16 అంకెల నంబర్‌ను తెలుసుకుని, ఎస్‌ఎంఎస్‌లో వచ్చిన పాస్‌వర్డ్ కూడా ఆయన ద్వారానే సేకరించి రూ.42,594 డ్రా చేశారని వివరించారు. వెంటనే ఎల్లారెడ్డి అప్రమత్తమై ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రై ం సిబ్బంది సాయంతో స్నాప్‌డీల్ ముంబయి పేరున ఒక వస్తువు కొనుగోలుకు ఈ నగదు డ్రా చేసినట్టు గుర్తించారని చెప్పారు. దీంతో వస్తువును డెలివరీ చేయకుండా ఆపాలని సమాచారం ఇవ్వడంతో వివరాలు తెలుసుకున్న స్నాప్‌డీల్ సంస్థ నిలుపుదల చేసిందన్నారు. అనంతరం ఎల్లారెడ్డి అకౌంట్‌లో రూ.28 నగదు జమ అయిందన్నారు. మిగిలినది కూడా త్వరలో జమకానుందని చెప్పారు. సెల్ వినియోగదారులంతా అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీరామ్మూర్తి కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement