శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు | bhajanas in srigiri | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు

Published Tue, Aug 2 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు

శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు

శ్రీశైలం : శ్రావణ మాసం సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం నుంచి శివచతుస్సప్తాహ భజనలlు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త మంగళవారం తెలిపారు. దేవస్థానం లోకకల్యాణార్థం ఏటా శ్రావణమాసంలో ఈ అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.  శ్రావణశుద్ధపాఢ్యమి నుంచి  సెప్టెంబర్‌ 2 భాద్రపదశుద్ధపాఢ్యమి వరకు నిరంతరాయంగా కార్యక్రమం సాగుతుందన్నారు. కర్నూలుకు చెందిన 4 భజనబందాలతోపాటు  కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా గోపానదేవహరళ్లి నుంచి ఒక బందానికి ఇందులో అవకాశం కల్పించినట్లు తెలిపారు. వీరు ఈ మాసమంతా రాత్రింబవళ్లు నిరంతరంగా ఓంనమఃశివాయ పంచాక్షరి ప్రణవభజనలు చేస్తారన్నారు. 456 వంవత్సరాలుగా  దేవస్థానం ప్రతి శ్రావణమాసంలో ఈ అఖండభజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement