జీవవైవిధ్యంతోనే మానవాళికి మనుగడ
జీవ వైవిధ్యం కాపాడేందుకు 1010 కమిటీలు:జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జీవవైవిధ్య మండలి ముద్రించిన 5 కొత్త పుస్తకాలను సో మవారం సచివాలయంలో మంత్రి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి, మానవ జీవనానికి అవినాభావ సంబం ధం ఉందన్నారు. జీవవైవిధ్యం ధ్వంసమైతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మా రుతుందన్నారు.
రాష్ట్రంలో గ్రామ స్థాయిలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1,010 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకునేం దుకు నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టామన్నారు. బయోడైవర్సిటీ మండలి సభ్య కార్యదర్శి సువర్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ లింగారావు, సైంటిస్ట్ లివిశర్మ పాల్గొన్నారు.