biological diversity
-
జీవవైవిధ్యాన్ని కాపాడుదాం
న్యూఢిల్లీ: భవిష్యత్ తరాల కోసం భూమిని సంరక్షించుకోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని ట్విటర్లో తన సందేశాన్ని ఉంచారు. ‘‘చెట్టు, చేమ భూమిపై నున్న సమస్త జీవజాలాన్ని కాపాడుకోవడానికి మనమంతా సమష్టిగా చేయగలిగినదంతా చేయాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భూమిని సుసంపన్నం చేసే జీవవైవిధ్యాన్ని కాపాడతామని అందరూ ప్రతిన బూనాలి’’అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాల వారు ఈ భూమిపై హాయిగా జీవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కి చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది థీమ్ జీవ వైవిధ్యం. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్ధితుల్లో ఇది అత్యంత అవసరం, గత కొద్ది వారాల లాక్డౌన్ సమయంలో జనజీవనం కాస్త నెమ్మదించింది కానీ, మన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవవైవిధ్యం గురించి ఆలోచించే అవకాశమైతే వచ్చింది’’అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇన్నాళ్లూగా ఎన్నో రకాల పిట్టలు అదృశ్యమైపోయాయని, ఈ లాక్డౌన్ కారణంగా పొద్దున్న లేస్తూనే మళ్లీ శ్రావ్యమైన పక్షుల కిలకిలారావాలు వినే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. -
పాప ఇంతగా నిద్రపోతోంది... ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య చాలా ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి లేపినా కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. పాప ఇలా అతిగా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? తగిన సలహా ఇవ్వండి. – వనజ, పాడేరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి పాప నిద్రపోవాల్సిన సమయం కంటే చాలా ఎక్కువ సేపు పడుకుంటోందని చెప్పవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. రంగులరంగుల ఆహారం తీసుకోవచ్చా? మా పాప బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా? – కె. దీక్ష, హైదరాబాద్ ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బీజీ–3 పత్తి విత్తనంతో కొంప కొల్లేరు
సాక్షి, హైదరాబాద్: బహుళజాతి సంస్థల బాగోతాలను చూసీచూడనట్లుగా వ్యవహరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’చందాన ఇప్పుడు మేల్కొంది. మూడు నాలుగేళ్లుగా బీజీ–3 పత్తి విత్తనాన్ని అనుమతి లేకుండా రైతులకు అంటగడుతున్నా పట్టించుకోని ఆ శాఖ ఇప్పుడు భయంతో వణికిపోతుంది. జీవ వైవిధ్యానికి పూడ్చలేని నష్టం జరుగుతుందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు అంచనాలకు మించి ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అందులో దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా. పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక పంపింది. ఆ నివేదికలోని వివరాలు... మోన్శాంటో చేసిన పాపమే... మోన్శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి అమెరికాలో వాణిజ్యపరం చేసి మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. అంతలోనే మహికో కంపెనీ ఆర్ఆర్ఎఫ్ కారకం గల బీజీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపిందని తెలిసింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో వ్యవసాయశాఖ వివరించింది. అనుమతి లేకుండా బీజీ–3 విక్రయాలు... బీజీ పత్తి విత్తనం ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. చాలా విత్తన కంపెనీలు బీజీ పత్తి విత్తనాలను విక్రయించాయి. దీనివల్ల పత్తి పండించే ప్రాంతాల్లో అనుమతిలేని చట్ట వ్యతిరేక జన్యుమార్పిడి కలిగిన కొన్ని రకాల బీజీ–3 పత్తి రకాలు విత్తనోత్పత్తి సమయంలో సహజంగా కలుషితమయ్యాయి. కలుపునాశిని, పురుగులను తట్టుకునే కారకాలు గల జన్యుమార్పిడి పత్తివిత్తనాలను అనుమతి లేకుండా అమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కేంద్రం అనుమతి లేకుండా అమ్ముతున్న విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. బీజీ–3 పత్తి రకాల వ్యాప్తిపై చర్చించి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. అనుమతిలేని బీజీ–3 విత్తనాల క్రమబద్ధీకరణ, పేటెంట్ హక్కులు తదితర అంశాలపై అదనపు అడ్వకేట్ జనరల్ నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించిన నివేదికలో పేర్కొంది. -
జీవవైవిధ్యంతోనే మానవాళికి మనుగడ
జీవ వైవిధ్యం కాపాడేందుకు 1010 కమిటీలు:జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జీవవైవిధ్య మండలి ముద్రించిన 5 కొత్త పుస్తకాలను సో మవారం సచివాలయంలో మంత్రి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి, మానవ జీవనానికి అవినాభావ సంబం ధం ఉందన్నారు. జీవవైవిధ్యం ధ్వంసమైతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మా రుతుందన్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1,010 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకునేం దుకు నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టామన్నారు. బయోడైవర్సిటీ మండలి సభ్య కార్యదర్శి సువర్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ లింగారావు, సైంటిస్ట్ లివిశర్మ పాల్గొన్నారు. -
జీవ వైవిధ్యంతోనే రైతుకు రక్షణ
ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య వెల్లడి హైదరాబాద్: జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ డాక్టర్ ఆర్.హంపయ్య, సభ్య కార్యదర్శి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. జీవ వైవిధ్య చట్టం, నియమావళి, వినియోగంపై వారు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ చట్టం 2002లో వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల వన్యప్రాణులు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, జల సంపద వంటివి ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిపోతున్నాయని వివరించారు. గిరిజనులు సేకరించే సహజ ఉత్పత్తులనేకానికి కనీస ధర కూడా ఇవ్వకుండానే పెద్దపెద్ద కంపెనీలు తరలించుకుపోతున్నాయన్నారు. మున్ముందు జీవ వైవిధ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ సౌలభ్య సంస్థ (జీఇఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని జీవ వనరుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త జి.సాయిలు తెలిపారు. -
జీవజాలానికి మనిషి గాయం!
ముప్పు ముంగిట దేశంలో జీవవైవిధ్యం హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో పరిస్థితి దారుణం పర్యావరణ శాఖ నివేదికలో చేదు వాస్తవాలు న్యూఢిల్లీ: దేశంలో జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది.. అనేక వృక్ష, పక్షి జాతులు ముప్పు ముంగిట నిలుచున్నాయి.. ప్రత్యేకించి హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలు, నికోబార్ దీవుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఇది ఏదో స్వచ్ఛంద సంస్థనో, పర్యావరణ నిపుణుడో చెప్పిన మాట కాదు! సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణ శాఖ నివేదికలో వెల్లడైన చేదు వాస్తవాలు!! ప్రకృతి వనరులను విచక్షణరహితంగా కొల్లగొడుతున్న మనిషి స్వార్థం, అడవుల్లో కార్చిచ్చులు, వాతావరణ మార్పులే జీవ వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని నివేదిక స్పష్టంచేసింది. జీవ వైవిధ్య సదస్సు(సీబీడీ) వ్యూహాత్మక ప్రణాళిక 2011-2020 కోసం పర్యావరణ శాఖ తాజాగా రూపొందించిన ఐదో జాతీయ నివేదికలో ఈ అంశాలను పొందుపరిచారు. మనదేశంలో ఉన్న 45 వేల రకాల వృక్ష జాతులు, 91 వేల రకాల జంతుజాలాలు ఉండగా.. అందులో పలు జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పేరిట అడవులను నరికివేయడం వన్యమృగాలకు పెనుశాపంగా మారుతోంది. అటవీ పరిరక్షణ చట్టం-1980 రూపొందించినప్పట్నుంచీ ఇప్పటిదాకా పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశంలో ఏకంగా 10.7 లక్షల హెక్టార్ల అటవీ భూమిని బదలాయించినట్లు నివేదికలో తెలిపారు. దేశ భూవిస్తీర్ణంలో 49.63 శాతం అడవులు ఉండాల్సి ఉన్నా.. అది కాలక్రమేణ గణనీయంగా పడిపోతున్నట్లు వివరించారు. అరావళి పర్వతాలు, పశ్చిమ శ్రేణులు వంటి ప్రాంతాల్లో గనుల త్వకాలు, క్వారీల వల్ల అక్కడి జీవజాలం మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. -
మరింత సంక్షోభంలో ప్రపంచ పర్యావరణం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సెల్ఫోన్ల సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న భూ తాపం భూగోళాన్ని నిప్పుల కొలిమిగా మార్చివేస్తోంది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లే విపత్కర పరిణామాలు పర్యావరణంలో నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దం నడుస్తోంది.దైనందిన వ్యవహారాలలో కూడా ప్రతిక్షణం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టు కొనవలసిన పరిస్థితులు ఇప్పుడు నెల కొని ఉన్నాయి. పర్యావరణ కార్యాచరణ పిలుపును అనుసరించి ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి జూన్ 5 తేదీని మేలుకొలుపు దినంగా మాత్రం గుర్తు చేసుకొం టోంది. కానీ ఈ ఏటి నినాదం ప్రత్యేకమైనది. పెరిగిన సము ద్ర నీటిమట్టాలు చిన్న ద్వీపాల మీద, ఇతర ప్రాంతాల మీద విరుచుకు పడి సృష్టించే జల ప్రళయ నివారణను ఈ సంవ త్సర నినాదంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. 1972 నాటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు మొదలు, నాలుగు దశాబ్దాలుగా భూగోళాన్ని రక్షించుకోవలసిన అవసరం గు రించి ఐరాస ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. కర్బన కాలుష్య ఉద్గారాలను ప్రణాళికాబద్ధంగా క్షీణింప జేసే, ‘గ్రీన్ ఎకానమీ’ లక్ష్యానికి అన్ని దేశాలు కట్టుబడి భూమిని రక్షించుకోవాలని యు.ఎన్.ఇ.పి. హెచ్చరిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయాలంటూ 194 దేశాలు చేసుకున్న క్యొటో ప్రొ టోకాల్ ఒప్పందాన్ని అమెరికా వంటి సంపన్న దేశం కూడా ఆమోదించినా, అక్కడి ‘సెనేట్’ సమ్మతించలేదు. 2011 డి సెంబర్‌లో యు.ఎన్. క్లైమేట్ అంతర్జాతీయ సదస్సు క్యొటో ఒప్పందం పొడిగింపుతో ఆశలను చివురింప చేసింది. ‘నేచర్ క్లైమేట్ ఛేంజ్’ చేసిన ఇటీవలి అధ్యయనం ప్రకారం 12 దేశాలకు సంబంధించిన 1.3 బిలియన్ జనావళి తాగు, సాగు నీటి అవసరాలకు ఆధారపడిన ఇండస్, గంగ, బ్రహ్మ పుత్ర, సల్వీన్, మెకాంగ్ నదీ ప్రవాహాలూ, హిమాలయ సానువులలోని గ్లేసియర్స్ అతివృష్టి, వరద ఉద్ధృతి కార ణంగా పెను జల ప్రళయాలను సృష్టించనున్నాయి. 2050 నాటికి, సమీప భవిష్యత్తులోనే ఈ పెను బీభత్సం ఆయా ప్రాంత జనావళి ఎదర్కోవలసి ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయన పత్రాలు హెచ్చరిస్తున్నాయి. కార్బన్ కాలుష్య ఉద్గారాల విడుదల మిలియన్‌కు 400 పార్ట్స్ వంతున పెరగటం వలన ఈ సంవత్సరం ప్రపంచం న్యూ డేంజర్ జోన్లోకి అడుగు పెట్టిందని యునెటైడ్ నేషన్స్ క్లైమేట్ సంస్థ అధిపతి క్రిస్టియానా ఫిగ్లెస్ హెచ్చరిం చారు. పారిశ్రామిక విప్లవ ఆరంభానికి ముందుకార్బన్ డై ఆక్సైడ్ 280 పిపిఎమ్లు ఉండేది. గత అరవై సంవత్సరా లలో చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ప్రకృతి వనరులను విచ్చ లవిడిగా మండించిన కారణంగా ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాద హెచ్చరికలను జారీ చేయగల స్థాయికి చేరుకుంది. కార్బన్ ఉద్గారాలు ఈ విధంగా పెరిగినట్లయితే ఈ శతాబ్దం అంతానికే భూతాపం తో ప్రపంచం అట్టుడికిపోవలసి ఉంటుందని ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ హెచ్చరించింది. మన మహోన్నత హిమవత్పర్వత ప్రాంతాలలో గత 40 సంవత్సరాలలో కరిగిన 13 శాతం గ్లేసియర్స్(హిమ నదా లు) ఇప్పటికే పెను ప్రళయాలు సృష్టిస్తున్నాయి. ‘కరెంట్ సైన్స్’ ఇటీవల ఇచ్చిన నివేదిక దీనిని నిర్ధారిస్తున్నది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ 2007లో ఇచ్చిన వివరణ ప్రకారం 2035 నాటికి హిమాలయాలు ఎదుర్కొనే పెను ప్రమాదాన్ని ఊహాజనితమని కొందరు కొట్టిపారే సినా, ఆ వివరణ పరిగణనలోనికి తీసుకోవలసినదేనని చార్ధామ్, కేదార్నాధ్లలో 2013 జూన్‌లో సంభవించిన జల ప్రళయం గుర్తు చేసిన మాట వాస్తవం. సెల్ఫోన్ల నిరంతర సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మనిషి అవస రాలను తృప్తి పరిచే తీరులో వినియోగపడవలసిన ప్రకృతి వనరులను నాగరిక ప్రపంచం దురాశతో కొల్లగొడుతున్నది. జీవవైవిధ్యంతో సుజలాం, సుఫలాం, మలయజ శీతలంగా విలసిల్లవలసిన భారతావని ప్రకృతి వైపరీత్యాలతో విలవిల లాడుతోంది. భవిష్యత్తు తరాల వారికి వారసత్వంగా, రుణం తీర్చుకొనే విధంగా అందించవలసిన ప్రకృతి సంప దను నవ నాగరిక జీవన వ్యామోహంతో యథేచ్ఛగా కొల్లగొ ట్టడమంటే మన గొయ్యిను మనం తవ్వుకోవడమే. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) జయసూర్య -
అంతరిస్తున్న అరుదైన జీవజాలం!
ఎర్రచందనం స్మగ్లర్లతో నేలకూలుతున్న వృక్షాలు పోలీసుల దారి మళ్లించేందుకు అడవికి నిప్పు శేషాచలంలో దెబ్బతింటున్న జీవ వైవిధ్యం సాక్షి, తిరుమల : ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలతో తిరుమల శేషాచల అడవిలోని అరుదైన వృక్ష, జంతు, జీవజాలం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం వందలాది మంది ఎర్రచందనం కూలీలు అడవుల్లో చొరబడుతూ చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. శేషాచల ఏడుకొండలు తూర్పు కనుమల్లో భాగమై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4756 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించాయి. ఈ అడవులు తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు ఉన్నాయి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండటంతో జాతీయ స్థాయిలో 1989లో శేషాచలాన్ని శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించారు. అనంతరం 2010 సెప్టెంబర్ 20వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో ‘శేషాచల బయోస్పియర్ రిజర్వు’గా భారత పర్యావరణ మరియు అటవీ శాఖ ప్రకటించింది. అప్పటి నుంచి ఇక్కడి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను పరిరక్షిస్తోంది. తిరుపతిలో బయోస్పియర్ ల్యాబ్ స్థాపించి జీవ వైవిధ్య పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.