కాటేసిన కంఠసర్పి
– బాలిక మృతి
– బాలుడిక అస్వస్థత
– మంత్రాలయంలో ఘటన
మంత్రాలయం రూరల్: కంఠసర్పితో మంత్రాలయం రాఘవేంద్రనగర్‌కు చెందిన పూజ(11) మృతిచెందింది. ఉంగరాల వ్యాపారం చేస్తున్న బద్రి, గానెమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. బుధవారం ఉదయం బహిర్బూమికి వెళ్లి వచ్చిన కొద్దిసేపటికి కుమారుడు జీవన్, కుమార్తె పూజ గొంతులో నొప్పిగా ఉందని తల్లితండ్రులకు చెప్పారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం శ్రీ మఠం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పూజ అప్పటికే మృతి చెందిందని చెప్పారు. జీవన్‌ను మాత్రం మెరుగైన వైద్యం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్య పరీక్షలు నిర్వహించి కంఠసర్పి అని తేల్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, గ్రామ సర్పంచ్ టి.భీమయ్య..రాఘవేంద్రనగర్‌కు చేరుకొని బాలిక మతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక అంత్యక్రియల నిమిత్తం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి రూ. 2 వేలు ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ టి.భీమయ్య, వార్డు మొంబర్ వీరన్న చేతుల మీదుగా అందజేశారు.