ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి | BJP Harithaharam | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Published Sun, Jul 17 2016 10:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - Sakshi

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి

వికారాబాద్‌ రూరల్‌: కాలుష్యరహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్‌ సుచరితరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ వినాశనానికి ఒడిగడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడంతోపాటు సంరక్షించుకునే బాధ్యతను సైతం తీసుకోవాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, అసెంబ్లీ కన్వీనర్‌ పాండుగౌడ్, జిల్లా కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కేపీ రాజు, పట్టణ అధ్యక్షుడు  సతీష్‌ కుమార్, అనిల్‌ యాదవ్, రాజు, నిరంజ¯ŒSరెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాములు, శంకర్‌రెడ్డి, సుదర్శ¯ŒS, ఆంజనేయులు, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement