దేశ ఐక్యతకు పాటుపడిన మహానేత శ్యాంప్రసాద్‌ | bjp leaders remembered shyam prasad | Sakshi
Sakshi News home page

దేశ ఐక్యతకు పాటుపడిన మహానేత శ్యాంప్రసాద్‌

Published Sat, Jun 24 2017 2:06 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

దేశ ఐక్యతకు పాటుపడిన మహానేత శ్యాంప్రసాద్‌ - Sakshi

దేశ ఐక్యతకు పాటుపడిన మహానేత శ్యాంప్రసాద్‌

ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట): స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశ ఐక్యత కోసం పరితపించి ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్‌ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆత్మకూర్‌ (ఎస్‌)లో నిర్వహించిన  సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలంతా ఆయన స్ఫూర్తితో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు.   కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేసి రానున్న 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సకినాల శ్రీనివాస్, దానియేల్, బీజేపీ నాయకులు మర్ల చంద్రారెడ్డి, తోట ప్రభాకర్, సూరకంటి భాస్కర్‌రెడ్డి, కలకోట్ల సైదులు, పందిరి రాంరెడ్డి, గుద్దేటి వెంకట్‌రెడ్డి, జలగం లక్ష్మయ్య, మాతంగి వెంకటయ్య, హుస్సేన్, జాన్‌రెడ్డి, గుండ్ల మల్లయ్య, శ్రీను, లక్ష్మయ్య, లింగయ్య, కృష్ణయ్య, కొల్లు జానయ్య, రాణాప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement