టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు | blosts tapasulu in nareducharla | Sakshi
Sakshi News home page

టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు

Published Sun, Aug 28 2016 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

blosts tapasulu in nareducharla

 నేరేడుచర్ల : నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవంచి ముగ్గురు గాయపడ్డారు.  పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాంపురం రోడ్డులో గల ఓ గదిలో కొవ్వూరు సాయిరెడ్డి(22), వల్లంకొండ రాములు (35) కొంత కాలంగా దసరా, దీపావళి పండగలకు అనుమతి లేకుండా బాణా సంచాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాణా సంచాలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటనలో కొవ్వూరు సాయిరెడ్డి, వల్లంకొండ రాములతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొంతునాల సత్తిబాబు(36)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలు సేకరించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయిరెడ్డి, రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement