‘రద్దు’తో అభివృద్ధికి బ్రేక్
పెద్దనోట్లతో రాష్ట్రానికి తగ్గిన ఆదాయం: మంత్రి హరీశ్‌రావు
హుస్నాబాద్: అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెం చాలనుకున్నామని, కానీ పెద్దనోట్ల రద్దుతో బ్రేక్ పడిందని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాటా ్లడుతూ.. నోట్ల రద్దుతో రాష్ట్రానికి వచ్చే వాణిజ్య, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ తదితర రంగాల ఆదా యం తగ్గిందన్నారు. అరుుతే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పయనిస్తోం దని, పెద్దనోట్ల రద్దుతో సీఎం కేసీఆర్ ఆర్థికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు సహకారం అందించాలని మోదీ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు.
పేదలు, సామా న్యులు, రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. రద్దు విషయంలో స్పష్టత రాలేదని, మరో నాలుగు రోజుల్లో అప్పటి పరిస్థితిపై నిర్ణయం తీసుకుంటా మన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పైరవీలకు తావు లేదని, కలెక్టర్లు ఎప్పుడు వస్తారో.. తెలియకపోయేదని, ప్రస్తుతం నెలకు మూడురోజులు గ్రామాల్లో తిరుగుతున్నారన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టనోళ్లు, నిర్లక్ష్యం చేసినోళ్లు భూసేకరణను అడ్డుకుంటున్నారని అన్నారు. భూసేకరణ చట్టం 2013, 123 జీఓల పరిధిలో ఎలాంటివి వర్తింపజేయాలన్నా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కొందరు కోర్టుకు వెళ్లారని, ఈ కేసును తొందరగా తేల్చేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.