ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండల పరిధి నంద్యాల– ఒంగోలు హైవేపై వేములపాడు ఘాట్ రోడ్డు దిగుడు కొంతదూరం వెళ్లిన తర్వాత చెట్లలో ఆదివారం
హనుమంతునిపాడు : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండల పరిధి నంద్యాల– ఒంగోలు హైవేపై వేములపాడు ఘాట్ రోడ్డు దిగుడు కొంతదూరం వెళ్లిన తర్వాత చెట్లలో ఆదివారం వెలుగు చూసింది. మృతదేహం గుంటూరు జిల్లాకు చెందిన మహిళదిగా సోమవారం ప్రాథమికంగా గుర్తించారు. కనిగిరి సీఐ సుబ్బారావు కథనం ప్రకారం.. ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. మహిళను హంతకులు కొట్టి చంపారు. ఆ తర్వాత ఆమెను కల్చి వేశారు. సంఘటన స్థలంలో రక్తంతో తడిచిన రాయి, వేరుశనగ కాయలు, అరటి కాయల తొక్కులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి చేతిపై పచ్చ బొట్టు ఉంది. కాళ్లకున్న పట్టీలు, మెట్టెలు, చేతి వాచ్, మెడలో ఉన్న సన్నని గొలుసు కాలి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఆదివారం పొదిలి నుంచి గిద్దలూరు బస్సు ఎక్కి ప్రయాణం చేసిన టిక్కెట్లు కూడా గుర్తించారు. హత్యకు ముందు ఆమెతో ఓ వ్యక్తి వచ్చినట్లు సమాచారం. హత్య ఆదివారం సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. మృతురాలు గుంటూరులో ఆమీనా సంస్థలో సెక్యూరీటీ గార్డుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. సీఐతో పాటు ఎస్‌ఐ హరిబాబు ఉన్నారు.