సిమ్‌ల విక్రయంలో జిల్లా దేశంలోనే ఫస్ట్‌ | bsnl sims sale district first place in india | Sakshi
Sakshi News home page

సిమ్‌ల విక్రయంలో జిల్లా దేశంలోనే ఫస్ట్‌

Published Mon, Aug 29 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

bsnl sims sale district first place in india

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జీఎం
  • రాష్ట్రంలో కొత్తగా 400 మంది
  • అధికారులు, సిబ్బంది అవసరం
  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : 
    సిమ్‌ల విక్రయంలో రాజమహేంద్రవరం టెలికాం జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కె. దామోదరరావు అన్నారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరంలోని సంచార్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 900 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అదనంగా మరో 400 మంది అవసరమవుతారని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు జీఎంలకు విజయవాడ పోస్టింగ్‌లు ఇచ్చామని, ఏడుగురు జీఎంలు, ఐదుగురు డీజీఎంలు ఇంకా అవసరమవుతారన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇంకా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీకి రాలేదన్నారు.  రాజధానిలో తమ సంస్థకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. కార్యాలయం సిద్ధమైనవెంటనే ఢిల్లీస్థాయిలో అధికారులు, సిబ్బంది తరలింపునకు కరసత్తు ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో 2జీ టవర్లు మొత్తం 4, 260 ఉన్నాయని, కొత్తగా మరో 60 టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3జీ టవర్లు మొత్తం 1900 ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి సంఖ్య మరింత పెంచుతామన్నారు. ఏపీ సర్కిల్‌లో ఏడు లక్షల 16 వేల టెలిఫోన్‌ కనెక్షన్లు, 65 లక్షల మొబైల్‌ కనెక్షన్లు, 2.72 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 18 ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మెరుగైన సేవలందించే దిశగా రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంలలో ఎన్‌జీఎస్‌ ఎక్స్ఛేంజ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా టెలికాం జీఎం ఎం. జాన్‌క్రిసోస్టమ్, డీజీఎం వి.రమేష్‌బాబు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement