బౌద్ధదేశంగా మారనున్న భారత్
బౌద్ధదేశంగా మారనున్న భారత్
Published Thu, May 11 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
-బుద్ధవిహార్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొల్లపల్లి
-ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
అమలాపురం రూరల్ : బౌధ్ద ధర్మాన్ని ఆచరిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్ త్వరలోనే బౌద్ధదేశంగా మారనుందని బుద్ధవిహార్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి సందర్భంగా బుధవారం ఇక్కటి త్రిరత్న బుద్ధవిహార్‌లో బుద్ధుని విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధుడి జననం, ఆయనకు జ్ఞానోదయం వైశాఖ పౌర్ణమి రోజునే జరిగాయపి చెప్పారు. శాంతి, ప్రేమ, దయ బౌద్ధధర్మం ద్వారానే వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్ర«««ధాన కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షతన జరిగిన సభలో సామాజికవేత్త ఎం.ఎ.కె.భీమారావు, బౌద్ధ ఉపాసకులు పినిపే రాధాకృష్ణ, పెయ్యల శ్రీనివాసరావు, దోనిపాటి ఆంజనేయులు, కాశీపరశు రాంబోది, దోనిపాటి నాగేశ్వరరావు, రేవు ఈశ్వరరావు, ఉండ్రు ఆశీర్వాదం, జిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదుర్రు బౌద్ధస్థూపం వద్ద..
మామిడికుదురు (పి.గన్నవరం) : పురాతన ఆది బౌద్ధస్థూపం వద్ద బుధవారం బుద్ధ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ప్రాంగణంలో పంచశీల పతాకావిష్కరణ, త్రిశరణ, పంచశీల, బుద్ధ వందన, ధమ్మ వందన, సంఘ వందన తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థూపం చుట్టూ ప్రదక్షణలు చేసి బుద్ధ వందనం చేశారు. ధమ్మ ప్రవచనాలు, ధమ్మపాలన గాథ తదితర అంశాలను భక్తులకు వివరించారు. ఉపాసక రొక్కాల రాజన్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో బర్మాకు చెందిన బౌద్ధ భిక్కులు పనసక్క, విసుత, థాయ్‌లాండ్‌కు చెందిన సంగియాన్, బూన్‌సాంగ్, సయన్‌బ్రహనిన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుద్ధుడు దేశంలో స్వర్ణ యుగానికి నాంది పలికాడని భిక్కులు పేర్కొన్నారు. భారతీయ వారసత్వ సంస్కృతులన్నింటిలో అత్యంత ప్రాచీనమైనది బౌద్ధ జీవన విధానమన్నారు. అనంతరం స్థానిక బుద్ధవిహార్‌లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో అధ్యక్ష కార్యదర్శులు చింతా శ్రీరామ్మూర్తి, ఎస్‌ఎస్‌ఆర్ భూపతి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మట్టా వెంకట్రావు, చింతపల్లి స్వరూపారాణి, పిల్లి రాంబాబు, సరెళ్ల వెంకటరత్నం, తాడి సురేష్, జి.వెంకటేశ్వరరావు, పెనుమాల సుధీర్, ట్రస్టు ప్రతినిధులు పులపర్తి కృష్ణ, గాలిదేవర సత్యనారాయణ, బళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement