కడప–బెంగళూరు ప్రధాన రహదారిలో చిన్నమండెం మండలం ముండ్లవారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
చిన్నమండెం(రాయచోటి రూరల్): కడప–బెంగళూరు ప్రధాన రహదారిలో చిన్నమండెం మండలం ముండ్లవారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 28 జడ్ 2875) రాయచోటి నుంచి కలిచెర్లకు వెళుతూ, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ప్రయాణికులు 8 మంది, కండక్టర్ వేణుగోపాల్‌లు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని చిన్నమండెం పోలీసులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ వీపీ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం అద్దం పూర్తిగా పగిలిపోయింది.