ముగ్గురు కారుదొంగల అరెస్టు
-
రూ. 4.65 లక్షల సొత్తు స్వాధీనం
పెద్దాపురం :
స్థానిక శ్రీనివాసా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇంట్లో ఇటీవల జరిగిన కారు చోరీ కేసును పెద్దాపురం పోలీసులు ఛేదించారు. సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ సోమవారం రాత్రి ఆ వివరాలను తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం పాతకొండంగూడానికి చెందిన చీకట్ల సతీష్, పెనుగొండకు చెందిన మద్దుల రాజేష్, విశాఖ జిల్లా మర్రిపాలెం మహారాణి వీధికి చెందిన కాలింగ అశోక్‌కుమార్ పెద్దాపురంతో పాటు తణుకు, జంగారెడ్డిగూడెం, ఇనగుడుదురు, పాలకొల్లు, గన్నవరం, మండపేట, కాళ్ళ, విజయనగరం ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డారు. ఇటీవల పెద్దాపురంలో చోరీకి గురైన కారును టోల్‌ప్లాజా వద్ద గుర్తించడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు రూ. 4 లక్షల 65 వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టుకు తరలిస్తామని సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు వై.సతీష్, బీవీ రమణ, ఎస్‌జీ వలీ, రాధాకృష్ణ, సాయి, గణేష్ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఎస్సైలు రమణ, వలీ, సతీష్, ఏఎస్సై బి.నరసింహారావు, సీసీఎస్ హెచ్‌సీలు బలరాంమూర్తి, జీఎస్‌ఎన్ మూర్తి, కె. రంగబాబు, పీసీ బి.రాధాకృష్ణ, ఎం.రాకేష్, జె. నాగరాజు, హెచ్‌సీలు వి.నాగభూషణం, వై.కృష్ణ, పీసీలు డి.సాయికృష్ణ, శ్రీనివాసరావులను సీఐ అభినందించారు.