అనంతపురం సెంట్రల్: తక్కువ తూకాలతో వినియోగదారులను మోసం చేస్తున్న నాలుగు చౌకధాన్యపు డిపోలపై కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతలశాఖ సీఐ శంకర్ తెలిపారు. ఆదివారం పుట్టపర్తి పట్టణ, శివారులోని 6, 7, 34, 35 చౌకడిపోలపై దాడులు చేశారు. 34, 35 డిపోల్లో తూకానికి బదులు శేర్లు వాడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. 6, 7 చౌకడిపోల్లో 600 నుంచి 800 గ్రామాలు చొప్పున తక్కువ తూకాలు వేస్తున్నట్లు తేల్చారు. నాలుగు డిపోలపైనా కేసులు నమోదు చేశారు.