
భవిష్యత్ నగదు రహితమే
కలెక్టర్ లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం అర్బన్: భవిష్యత్ నగదు రహిత కార్యకలాపాలదేనని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నా రు. ఆంధ్రా బ్యాంకు జోనల్ కార్యాలయంలో మం గళవారం ఆంధ్రా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ బిజినెస్ కరస్పాం డెంట్ల పాత్ర ప్రస్తుతం క్రియాశీలకమన్నారు. ప్రజ ల్లో నగదు రహిత కార్యకలాపాలపై అవగాహన కలిగించేందుకు, వారి కార్యకలాపాల్లో తోడ్పాటు ను అందించేందుకు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. బ్యాంకులు కొత్తగా నియామకాలు చేపట్టనవసరం లేదనే విధంగా సేవలు అందించాలని ఆయన కోరారు.
అధికంగా వ్యాపారం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర బ్యాంకర్ల స మావేశంలో ప్రతిపాదిస్తామని అన్నారు. నగదు ర హిత సమాజం దిశగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు ఆధార్, బయోమెట్రిక్ అ నుసంధానించిన జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ. 33 కోట్లను పింఛన్లుగా ప్రతి నెలా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని దాదాపు 400 మీసేవ కేంద్రాలను, 2099 చౌకధరల దుకాణాల డీలర్లను బిజి నెస్ కరస్పాండెంట్లుగా చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత స్థితికి శ్రీరారం చుట్టామని చెప్పారు. రైతు బజార్లలో స్వైప్ మెషీన్లను, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు.
మినీ ఏటీఎంల నుంచి రూ. 500 వరకు 50, 100 రూపాయల నోట్లను పొందవచ్చని చెప్పారు. సీతంపేటలో సోమవారం ప్రారంభించామని, ప్రతి సోమవారం నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ బిల్లులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో అనుసంధానం చేసి చెల్లింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలోను మైక్రో ఏటీఎంలను ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం విక్రయాల వద్ద స్వైప్ మెషీన్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని చెప్పారు. తద్వారా ఎంఆర్‌పీ ధరలకు విక్రరుుస్తారని, బెల్టు షాపుల నివారణకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ప్రతి వ్యవహారం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని అన్నారు
నగదు రహిత గ్రామాలు
జిల్లాలోని 38 మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నగదు రహిత గ్రామంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు శాఖలు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి నగదు రహిత కార్యాకలాపాల దిశగా తీసుకువెళ్లడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. జనవరి 1 నుంచి సంపూర్ణ నగదు రహిత గ్రామాలుగా ఇవి ఆవిర్భవించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ బీఆర్‌కే రావు, సహాయ జనరల్ మేనేజర్ కె.రాజేంద్రకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ పి. వెంకటేశ్వరశాస్త్రి, ఆర్థిక సలహాదారులు ఆర్‌ఆర్‌ఎం పట్నాయక్, కె. గిరిజా శంకర్, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.