‘కుల వ్యవస్థను రద్దు చేయాలి’
Published Thu, Jul 28 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా నాటుకుపోయిన కులవ్యస్థను తక్షణమే రద్దుచేయాలని జిల్లా మాజీ సైనిక, కుటుంబ సంక్షేమ సంఘ అధ్యక్షుడు డి.సింహాచలం, ఉపాధ్యాక్షుడు పి.మురళీధరరావు, కార్యదర్శి ఎస్‌వీ నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కులవ్యవస్థ రోజురోజుకూ పెచ్చుమీరిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ప్రజలు వారి జీవనోపాధి కోసం చేపట్టిన వృత్తులనుబట్టి వారి కులాలను వేరు చేశారని, దేశం అభివృద్ధి చెందిన తర్వాత ఏ ఒక్కరు తమ కులవృత్తులను చేపట్టడంలేదని గుర్తుచేశారు. కులప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించినందుకు కులవ్యవస్థ నిర్మూలన సాధ్యపడడం లేదని తెలిపారు. దయనీయ కుటుంబ తలసరి ఆదాయం, దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాల్సింది పోయి కులాలను పెంచిపోషిస్తుండడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
Advertisement