'మాయమాటలకు రూ.400 కోట్లు'
కర్నూలు: ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాటవేత ధోరణిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. మోదీ, బాబులు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
బాబు, మోదీలు మాయమాటలు చెప్పడానికి రూ.400 కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నాయకులు మరచిపోయారని, రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించకపోవడం శోచనీయమని భూమా అన్నారు.