అప్పన్న సన్నిధిలో కేంద్ర బృందం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకి చెందిన వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. కర్ణాటకకు చెందిన తేజశ్వర్, దీపక్ కరియాని, బీహార్‌కి చెందిన సుమిత్ అగర్వాల్, చత్తీస్‌గఢ్‌కి చెందిన షామి మహ్మద్‌ఖాన్ తదితరులు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.