– బలవణ్మరాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
– రెండో రోజు పర్యటనలో కేంద్ర బందం ప్రతినిధులు
అనంతపురం అగ్రికల్చర్ : అనావష్టి పరిస్థితుల వల్ల వరుసగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో జిల్లాలో రైతు కుటుంబాల పరిస్థితి దయనీయంగానే ఉందని కేంద్ర ప్రభుత్వ రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ (సెంట్రల్ సూసైడ్ కమిటీ) ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) ప్రతినిధులు డాక్టర్ జె.రాంబాబు, డాక్టర్ బి.రాము, డాక్టర్ ఎం.నాగేశ్వరరావుతో కూడిన ముగ్గురు అధికారుల బందం శనివారం జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే.
తొలిరోజు బుక్కపట్నం, ఓడీచెరువు, కదిరి మండలాల్లో పర్యటించిన బందం రెండో రోజు ఆదివారం మరో ఏడు మండలాల్లో పర్యటించారు. డీడీఏ ఎం.కష్ణమూర్తి, గార్లదిన్నె ఏఓ శ్రీనాథరెడ్డిని వెంటబెట్టుకుని అనంతపురం రూరల్ మండలం నరసనాయునికుంట తండా, గార్లదిన్నె మండలం మర్తాడు, కల్లూరు, శింగనమల మండలం లోలూరు, కొరివిపల్లి, బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం, సంజీవపురం, నార్పల మండలం నరసాపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులు, బలన్మరణాలకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పరిహారం పంపిణీ, ప్రస్తుతం కుటుంబ పరిస్థితి గురించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కనీసం 20 కుటుంబాలకు సంబంధించి సేకరించిన డేటాను అధ్యయనం చేయడంతో పాటు సమగ్రంగా విశ్లేషించి డిసెంబర్ 15 నాటికి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలు, జిల్లా స్థితిగతులు చెప్పడానికి ఆయన నిరాకరించారు.
దుర్భరంగా రైతు జీవితాలు
Published Sun, Oct 23 2016 10:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement