ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం మార్పు | Change of SSA office | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం మార్పు

Published Mon, May 22 2017 10:37 PM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

Change of SSA office

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

స్థానిక విద్యుత్‌నగర్‌ సర్కిల్‌లోని  సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయాన్ని టీవీ టవర్‌ వెనుక ఉన్న భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా సోమవారం నూతన భవనంలో పూజలు నిర్వహించారు.  టీవీ టవర్‌ సమీపంలోని ఈ ప్రభుత్వ భవనం వినియోగంలోలేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని, అన్యాక్రాంతం అవుతుండేది.

అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ ఈ భవనాన్ని పరిశీలించారు. రూ.40 లక్షల దాకా ఎస్‌ఎస్‌ఏ నిధులతో భవనానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు. నూతన భవనం సిద్ధం కావడంతో కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆమోదముద్ర వేయడంతో  ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాన్ని అక్కడికి మార్చారు. పీఓ దశరథరామయ్య మాట్లాడుతూ కొత్త భవనం చాలా సౌకర్యవంతంగా ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement