తిరుపతి: తిరుపతిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రి సమీపంలో నడిరోడ్డుపై పసికందు తల పడి ఉంది. దీంతో స్ధానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును ఎవరైనా హత్య చేసారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రుయా ఆస్పత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.