తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న చైల్డ్‌లైన్ ప్రతినిధులు
బాల్య వివాహానికి నేచర్ కొలాబ్ ఆర్గనైజేషయన్ 1098 సంస్థ (చైల్డ్‌లైన్) సభ్యులు బ్రేకులు వేశారు. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామాని చెందిన 16 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 25న వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహానికి నేచర్ కొలాబ్ ఆర్గనైజేషయన్ 1098 సంస్థ (చైల్డ్‌లైన్) సభ్యులు బ్రేకులు వేశారు. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామాని చెందిన 16 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 25న వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి 1098కు ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో చైల్డ్‌లైన్ సభ్యులు ఇరు కుటుంబీకులతో పాటు గ్రామపెద్దలను విజయనగరంలోని చైల్‌లైన్ కార్యాలయానికి శుక్రవారం పిలుపించుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లు నిండకుండా అమ్మాయిలకు వివాహం చేయడం నేరమన్నారు. దీంతో వివాహం నిలిపివేయడానికి ఇరువురూ అంగీకరించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు జి.కె. దుర్గ, గణేష్. అప్పలరాజు, రమణమ్మ, వినోద్, యాళ్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.