శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు | child sex harrasment | Sakshi
Sakshi News home page

శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు

Published Fri, Feb 19 2016 4:05 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు - Sakshi

శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు

పరిగి: బాలిక శీలం విలువ అక్షరాలా రూ.50 వేలు. ఔను ఇది నిజం. కొందరు పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి తీర్మానించిన మొత్తం ఇది. పరిగి మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు పదిహేనేళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాలికను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తండ్రి లేడు. తన పక్కనే నిద్రిస్తున్న తల్లి దురాగతాన్ని అడ్డుకోలేని నిస్సహాయురాలు. జరిగిన దారుణంపై గురువారం ఉదయమే బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి శీలానికి వేలం కట్టారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement