ఏలూరు: అధికార పార్టీ అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం బి. సింగవరంలో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. దుగ్గిరాల గ్రామంలో ఓ వివాద విషయమై మీడియా కవరేజ్ వెళ్లిన సాక్షి ప్రతినిధులపై చింతమనేని సతీష్ అనుచరులు గురువారం దౌర్జన్యానికి పాల్పడ్డారు.
సాక్షి కెమెరామెన్, సిటీ రిపోర్టర్లపై చింతమనేని సతీష్, అతని 20 మంది అనుచరులతో కలిసి దాడి చేశారు. మీడియా ప్రతినిధుల నుంచి సెల్‌ఫోన్లు, కెమెరా లాక్కుని వారు వెళ్లిపోయినట్టు తెలిసింది. దుగ్గిరాల గ్రామ ఉప సర్పంచ్‌గా ఉన్న చింతమనేని సతీష్.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు దగ్గరి బంధువు అవుతాడు. ఈ దాడి ఘటనపై సాక్షి ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సాక్షి ప్రతినిధులపై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
Published Thu, Aug 25 2016 9:27 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement